ప్రేమించు కున్నారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ.. యువతి ఇంట్లో మరొకరితో వివాహం నిశ్చయించడంతో.. మనస్థాపం చెందిన ప్రియురాలు తన ప్రియుడితో కలిసి పురుగుల మందు సేవించి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముల్కలపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకలగూడేనికి చెందిన మడకం సోనా, దేవీ అనే యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే దేవీకి ఇటీవలే పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. సోమవారం రాత్రి అన్నారం శివారు అటవీ ప్రాంతంలో గ్రామస్తులు రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలిలో ఉన్న పురుగుల మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గత ఏడాది ఏప్రిల్ 19న పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచళనంగా మారింది. కణుకుల గ్రామానికి చెందిన శివ, సుస్మిత ఇద్దరూ మైనర్లు.. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వ్యవహారం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.. ఇద్దరి కులాలు వేరుకావడం, మైనర్లు కావడంతో పెళ్లి చేయలేమని ఇరు కుటుంబాలు తేల్చి చెప్పాయి.. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పురుగులమందు తాగి చికిత్స పొందుతూ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.. ప్రియుడి మరణవార్త విని తట్టుకోలేక సుస్మిత గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ జంట ఆత్మహత్యతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..
రాజకీయ భవిష్యత్ పై ఆ నేతకు క్లారిటీ లేకుండా పోయిందా..?