టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. అక్కడి నుంచి తరలించారు.
అయితే.. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మట్టి దోపిడి జరుగుతుందని ఆరోపిస్తూ నేడు చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల నరేంద్ర పిలపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ విధించినట్టుగా చెప్పారు. అనుమర్లపూడిలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అనుమర్లపూడికి రాకుండా.. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం పోలీసుల కళ్లుగప్పి అనుమర్లపూడికి చేరుకన్నారు. నిన్న రాత్రి ఇంట్లో లేకుండా.. ఈ రోజు ఉదయం అనుమర్లపూడిలో నరేంద్ర ప్రత్యక్షమయ్యారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
కాగా.. ఇటీవల కూడా ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువులో మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లిన ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు, మట్టి మాఫియా అడ్డుకుంది. టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. దూళిపాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన కారుపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ పరిణామాలపై స్పందించిన ధూళిపాళ్ల నరేంద్ర.. అక్రమాలను ప్రశ్నిస్తే ‘‘మీకేందుకు భయం’’ అని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు. జగనన్న కాలనీ పేరుతో పంచాయతీ తీర్మానం చేసి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. ట్రాక్టర్ మట్టి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని విమర్శించారు. ఇలా దౌర్జన్యాలు చేస్తే భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Bandi Sanjay: సీఎంకు బండి లేఖ.. ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని ఫైర్