స్థలం ఖాళీ వుంటే చాలు అది మనదే.. ఇలా బడాబాబుల వ్యవహారం నడుస్తోంది. ఆస్థలం కోసం రౌడీలను సైతం రంగంలోకి దింపేందుకు వెనుకాడటం లేదు. ఆస్థలం మీద యజమాని పట్టాలు చూపించిన.. స్థలం కబ్జాచేసేందుకు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇలాంటి ఘటనూ కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులో జరిగింది.
కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ హల్ చల్ చేసింది. కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్నామని ప్రాధేయపడిన వారిపై కబ్జా గ్యాంగ్ కనికరించడం లేదు. రేకుర్తి శివారులో 117 సర్వే నంబర్ లో సాధబైనామ ద్వారా భూమిని కొనుగోలు చేసామని కొంతమంది కూలీలు వేడుకుంటున్నా వారి మాటలు పెడిచెవిన పెట్టి కబ్జా గ్యాంగ్ వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. కుటుంబం రోడ్డున పడుతుందని ప్రాధేయ పడ్డా కనికరం చూపడంలేదని వాపోతున్నారు. ఇదే సర్వే నంబర్ 12 గుంటల భూమి ఉందని ఓ వర్గం రంగంలోకి దిగడంతో.. అక్కడ కొనుగోలు చేసిన కూలీలకు , ఆవర్గం వారికి వాగివ్వాదం జరిగింది. అయినా కబ్జాగ్యాంగ్ వెనక్కు తగ్గలేదు. ల్యాండ్ ఖాళీ చేయించేందుకు రౌడి గ్యాంగ్ రంగంలోకి దిగడంతో.. అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. భూ వివాదాలు న్యాయ స్థానల్లో పరిష్కరించుకోవాలని చెప్పే పోలీసులు.. ఇంత జరుగుతున్నా సైలెంట్ గా ఉండటం పై సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
సామాన్యులకు అండగా వుండాల్సిన పోలీసులే రౌడీలకు మద్దతు పలుకుతున్నారని సాధబైనామ ద్వారా భూమిని కొనుగోలు చేసిన కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపుకొట్టుకుని కూలీ నాలీ చేస్తూ వచ్చిన డబ్బులతో ఈ స్థలం కొనుగోలు చేసామని, పట్టాలు చూపిస్తున్నా.. స్థలం కబ్జా చేయడం ఏంటని, మేము రోడ్డున పడతామని కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్రమంగా మా భూమిని కబ్జాచేస్తే మాకు నిలువ నీడలేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. సెటిల్ మెంట్ గ్యాంగ్ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నా.. పోలీసులు సైలెంట్ గా వ్యవహరించడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral News: కాళేశ్వరంలో చేపల వాన