తెలంగాణ సంచలనం రేకెత్తించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆదిభట్ల పోలీసులు.. గోవాలోని కాండోలిమ్ బీచ్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడిని గోవా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇక, అతని దగ్గర ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 9న వైశాలి ఇంటిపై నవీన్‌రెడ్డి, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే, వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఓ రౌడీ గ్యాంగ్ ఆయువకుడ్ని కిడ్నాప్ చేసి విచకణారహితంగా దాడి చేసింది. వారి గ్యాంగ్ నుంచి పక్కకు వెళ్లిపోవడంతోనే ఈఅరాచకానికి పాల్పడ్డారు ఈరౌడీ గ్యాంగ్. అన్నా వదిలండి అంటూ ప్రాధేయపడినా వినకుండా బట్టలు విప్పి స్థంబానాకి కట్టేసి బెల్ట్ , రాడ్లతో చితకబాదారు.
నకిలీ బాబాకేసు భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎన్జీవో ఆపరేషన్ ఎంట్రీతో పాతబస్తీ చర్చనీయాంశంగా మారింది. నకిలీ బాబా మహిళలపై చేస్తున్న అరాచకాలకు తెరదించింది. అయితే పాతబస్తీ బాబా కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వరంగల్ పోలీసులు.. లింగగిరి క్రాస్ రేపు తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి వైఎస్ షర్మిల సిద్ధం అయ్యారు.. రేపటి నుండి పాదయాత్రను పునఃప్రారంభించేందుకు గాను పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.. అయితే, పాదయాత్ర అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దు..? అంటూ ఆమెకు పోలీసులు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటి సారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు.. వారు…
బెజవాడలో గంజాయి, బ్లెడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన ఇప్పుడు కలకలం సృష్టించింది. స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న ఏడో తరగతి విద్యార్థిని అడ్డగించిన బ్లేడ్ బ్యాచ్… బ్లేడు చూపిస్తూ.. విద్యార్థిని బెదిరించింది.. డబ్బులు కావాలని దాడికి దిగింది.. దాంతో భయంతో వణికిపోయిన ఆ విద్యార్థి వారి నుండి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి పరుగులు పెట్టాడు.. జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో పక్క…
సామాన్యులే కాదు.. పేకాడుతూ దొరికిన ప్రముఖులు ఉంటారు.. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. ఏపీ గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 ప్రకారము సెక్షన్ 275 కింద కేసు నమోదు చేశారు.. ఈ ఎఫ్ఐఆర్ లో ఏ9 గా వరుపుల సుబ్బారావు పేరును చేర్చారు.. గత నెల 26న పేకాడుడూ పోలీసులకు…
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ వర్సెస్ పోలీసుగా మారిపోయిందట పరిస్థితి.. జిల్లా ఎస్పీలకు కొన్ని విషయాల్లో నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయట.. అయితే, ఈ వ్యవహారం పోలీస్ బాస్‌కు రుచించడంలేదు.. జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ నేరుగా ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి… ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంటూ మెమో జారీ చేశారు. జిల్లా ఎస్పీలకు నేరుగా ఆదేశాలు జారీ చేసిన ఇంటెలిజెన్స్…
అసలే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతులు, అభ్యర్థులు ఎలా దొరుకుతారు? అనే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు.. అయితే, మున్సిపల్ ఎన్నికలో ఆప్ తరపున బరిలోకి దిగుతోన్న సింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్న సింగ్.. కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్స్‌లు ఇరగదీశారు.. అంత వరకు బాగానే ఉంది అనుకుందాం.. కాసేపటి సడన్‌గా గన్ బయటకు తీసిన…
తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం…
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రాష్ట్రంలోనే కాదు.. దేశ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. దానికి ప్రధాన కారణం, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటి చర్యలతో పాటు.. కఠినమైన రూల్స్ కారణంగా.. ప్రజలు తక్కువ సంఖ్యలో బయటకు రావడమే.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత.. క్రమంగా రోడ్డు ప్రమాదాలు.. ఆ ప్రమాదాల్లో మృత్యువాత పడేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ పోతోంది.. కరోనా సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు.. ఆ తర్వాత.. మళ్లీ…