Villagers Attack Police : సారా తయారు చేస్తున్నారని తనిఖీకి పోతే.. తరిమి తరిమి కొట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Villagers Attack Police : ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. సింఘన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్‌గావ్ గ్రామంలో గురువారం అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులంతా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్న వారిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది రైడ్ చేశారు. అయితే గ్రామస్తులు వారిని ప్రతిఘటించి ఎదురుదాడి చేశారు. ఊహించని ఈ సంఘటనకు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది షాక్ అయ్యారు. కొందరు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
Read Also : Bolivia Clashes : బొలీవియాలో బీభత్సం.. గవర్నర్ అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు
Also Read
గ్రామస్తుల దాడిలో పలువురు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, నాటుసారా తయారీపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా ఈ సంఘటన జరిగింది. నాటు సారా తయారీని అడ్డుకుని వాటిని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిపై వారు దాడి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న 15 మందికిపైగా గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!