E Challan Scam: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ కుంభకోణం బయటపడింది.. ట్రాఫిక్ ఈ-చలాన్లలో నిధుల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి… వాహనదారుల నుండి పోలీసులు వసూలు చేసే నిధులను సొంత ఖాతాలకు డేటా ఇవాల్వ్ సొల్యూషన్స్ కంపెనీ మళ్లించుకున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. సుమారు 35.5 కోట్ల రూపాయలు నిధులు దారి మల్లాయని కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ చల్లాన్ ద్వారా రూ.101 కోట్లకు పైగా వసూలు చేసిన డేటా ఇవాల్వ్ సంస్థ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో కొంత భాగాన్ని సొంత ఖాతాలకు తరలించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. అయితే, దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: MLA Laxma Reddy: రేపే జడ్చర్లలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ.. ఏర్పాట్లు పరిశీలించిన లక్ష్మారెడ్డి
ఇక, ట్రాఫిక్ ఈ-చనాన్ల ద్వారా వచ్చిన సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించిన కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొమ్మిరెడ్డి అవినాష్.. మరోవైపు గుంటూరు కోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.. బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది గుంటూరు మొదటి అదనపు జిల్లా కోర్టు.. ఈ చనాన్ల సొమ్ము పక్కదారి పట్టించిన కేసులో.. ఇవాల్వ్ సొల్యూషన్స్ కు చెందిన రాజశేఖర్ అనే ఉద్యోగిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, ఏపీ సంచలనంగా మారిన ఈ కేసులో లోతైన విచారణ జరిగితే.. అది ఎటువైపు దారి తీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.