Uttar Pradesh Crime: ఓ యువకుడితో ప్రేమలో పడింది.. వారి ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది.. అయితే, ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో.. ప్రియుడిని ఇంటికి రమ్మని చెప్పింది.. ఇంటికి వచ్చిన ప్రియుడితో రొమాన్స్‌లో మునిగిపోయింది.. అయితే, ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న సమయంలో.. ఆ యువతి చెల్లెళ్లు అయిన ఇద్దరు చిన్నారులు ఆ దృశ్యాలను చూశారు.. దీంతో.. భయంతో వణికిపోయిన ఆ యువతి.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే కష్టమని.. ఆ ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా హత్య చేసింది.. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది.
యూపీలోని బల్రాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఇద్దరు చిన్నారుల హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌పుర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుణ్ని రమ్మని చెప్పింది.. అతడితో అత్యంత సన్నిహితంగా ఉంది.. అయితే, ఆ దృశ్యాలను ఏడు, నాలుగేళ్ల వయసున్న ఆ యువతి ఇద్దరు చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన యువతి.. ఆ చిన్నారులు తన చెల్లెళ్లు అనే విషయాన్ని కూడా మరిచి కర్కషంగా వ్యవహరింంచింది.. పదునైన ఆయుధంతో గొంతు కోసి చెల్లెళ్లను దారుణంగా హత్య చేసింది. అయితే, ఓ కట్టుకథ అల్లి బయటపడాలని చూసింది.. చెల్లెళ్లను ఎవరో చంపేశారని తల్లిదండ్రులకు చెప్పింది.. కానీ, ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న ఆ యువతి దుస్తులను గుర్తించిన పోలీసులు.. జంట హత్యలపై ఆమెను నిలదీశారు. దీంతో.. అసలు విషయం బయటపెట్టింది.. వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఇద్దరు చిన్నారుల హత్యకు.. నిందితురాలైన అంజలికి ప్రియుడు, మరికొందరు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఓ పోలీసు అధికారి.. ఇద్దరు చిన్నారులు.. అంజలి తన ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో ఉన్నప్పుడు చూశారు.. దీంతో తన గురించి అందరికీ చెప్పేస్తారనే భయంతో.. ఆమె వారిని పారతో చంపేసిందని.. సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు ఆమె తన బట్టలు ఉతికి, హత్యకు ఉపయోగించిన పారను కూడా శుభ్రం చేసిందని.. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు పారకు ఉన్న రక్తపు మరకలు క్లీన్ చేసి ఉన్నాయని తెలిపారు.. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు పోలీసులు.