Anantapur Crime: ఆడ పిల్ల బయటకు అడుగు పెట్టిందంటే.. మళ్లీ ఇంటికి చేరేవరకు.. ఎక్కడ ఎవరు ఉన్నారో.. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు దాపురించాయి.. ప్రయాణంలో అయినా.. స్కూల్‌లో అయినా.. కాలేజీలో అయినా.. ఆఫీసులో అయినా.. మరో ప్రాంతంలోనైనా.. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో.. వాడి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఈ రోజుల్లో చిన్నారుల నుంచి ఆగవాళ్ల వరకు అవగాహన ఉండాలి.. ఎందుకంటే.. ఒకడు ప్రేమ అని వెంటపడతాడు.. కోరిక తీర్చుకోవడానికి బలవంతం చేస్తాడు.. తీరా ఫొటో, వీడియోలు తీసి బ్లాక్‌బెయిల్ చేస్తాడు.. ఇలా ఎన్నో ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగు చూసి సంచలనంగా మారింది..
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వం మెడలు వంచి.. మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన ఓ విద్యార్థిని విజయవాడలో ఉంటూ బీటెక్ చదువుతోంది. అయితే, అదే ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా వెంటపడ్డాడు.. అంతే కాదు.. నన్ను ప్రేమిస్తావా లేదా? అంటూ బ్లేడుతో చేతి కూడా కోసుకోవడంతో.. భయంతో వణికిపోయిన ఆ విద్యార్థిని అప్పడి నుంచి అతడితో సన్నిహితంగా ఉండేది.. ఇదే అదునుగా భావించిన కృష్ణారెడ్డి.. గత నెల 19వ తేదీన విజయవాడలో ఉన్న యువతికి ఫోన్ చేసి.. బెంగళూరుకు రావాలని బలవంతం చేశాడు.. లేనితో మన ఇద్దరి పరిచయాన్ని మీ ఇంట్లో చెబుతానంటూ బెదిరించాడు.. అప్పటికే భయంతో ఉన్న ఆ యువతి అతడు చెప్పినట్టుగానే 20వ తేదీన బెంగళూరుకు వెళ్లింది. అదే ఆమె పాలిట శాపంగా మారిరంది..
Read Also: Realme GT5 Pro Price: రియల్‌మీ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
ముందుకు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. కృష్ణారెడ్డి.. ఆ యువతిని తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు.. ఎవరూ లేని సమయం చేసి.. ఆమెను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఒక్కరోజు కాదు.. అలా నాలుగు రోజుల పాటు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. వేధింపులు బరించలేకి సొంతూరుకు వెళ్లిపోయిన ఆ విద్యార్థిని తిరిగి 28వ తేదీన విజయవాడ వెళ్లేందుకు తండ్రితో కలిసి గుత్తి వరకు వెళ్లింది. అక్కడి నుంచి విజయవాడ ప్రయాణానికి సిద్ధమైంది.. కానీ, గమ్యం చేరకుండానే మరో కామ పిశాచి వలలో చిక్కుకుంది.. గుంతకల్లుకు చెందిన దివాకర్ అనే వ్యక్తి బాధితురాలికి ఫోన్ చేసి.. కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్టు చేయకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దాంతో.. భయపడిన బాధితురాలు.. దివాకర్ చెప్పినట్టు గుంతకల్లుకు వెళ్లింది.. అతడు కూడా ఓ లాడ్జికి తీసుకెళ్లి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. రెండు రోజుల పాటు ఆమెకు నరకం చూపించాడు. అంతే కాదు.. ఆమెను లైంగిక చర్యలో ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు. అక్కడితో వాటి అరాచకం ఆగలదేఉ.. వాటిని కృష్ణారెడ్డితో పాటు మరికొందరికి షేర్ చేశాడు.. ఆ తర్వాత మిత్రులుకు పంపారు.. కానీ, ఈ దారుణాన్ని పసిగట్టలేకపోయినా బాధితురాలు.. విజయవాడకు వెళ్లిపోయింది. కానీ, ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతూ తిరుగుతూ.. మండలానికి చెందిన ఓ వ్యక్తికి చేరాయి.. అతడు ఆ అమ్మాయి సమీప బంధువులకు విషయం తెలియజేశాడు.. దీంతో. ఆందోళనకు గురైన ఆ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.. అనంతపురం దిశ మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలతో కలిసి ఫిర్యాదు చేశారు.. పలు మార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన కృష్ణారెడ్డి, దివాకర్ అరెస్ట్ చేశారు..