హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గగన్‌పహాడ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. థర్మాకోల్ తయారీ కంపెనీలో ఈ మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది... ఈ క్రమంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండోవర్ చేశామని సీపీ పేర్కొన్నారు. మరోవైపు.. 7 జోన్లలో 1600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా.. 2 లక్షలు వాహనాలు చెక్ చేశామని.. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని ఫోన్ కాల్ రావడంతో షాక్‌కు గురి అయ్యారు. ముంబైలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు ఏక్తా నగర్లో తలదాచుకున్నారని అతడు ఫోన్లో పోలీసులకు తెలిపారు.
మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ప్లే చేసే విషయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు లక్నో, కాన్పూర్ సహా రాష్ట్రవ్యాప్తంగా లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నారు.
ఫిషంగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు..
ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విశాఖపట్నంలోని పెందుర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెందుర్తిలోని చిన్న ముసలివాడ గణేష్ నగర్ ప్రాంతంలో ఆవేశంలో అత్తను అల్లుడుచంపేశాడు. మృతురాలి పేరు దొగ్గ లక్ష్మీ వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. హంతకుడు కే. సన్యాసి నాయుడిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్స్పెక్టర్గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.