స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు.