వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు అనుమతి ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు... అయితే, అనుమతి ఇస్తూనే.. కొన్ని షరతులు పెట్టారు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు జగన్ వెళ్లనుండగా.. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో ఐదువందల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు..
Nalgonda: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు,…
BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వాతావరణంలో కలకలం రేగింది. జనవరి 21న జరగాల్సిన ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు…
ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు బీజేపీ తల పెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎక్కటేలకు అనుమతి ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు.. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోగా… పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బీజేపీ నేతలు.. ప్రజాస్వామ్యం గొంతు నులిమే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. ఇందిరా పార్క్ వద్ద సీఎం ధర్నా…
చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు షాకిచ్చారు. తిరుపతి సమీపంలో ఉన్న రాయలచెరువు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాయలచెరువును రెడ్‌జోన్‌గా గుర్తించామని… గండి పడటంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. Read Also: ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రాయలచెరువు వద్ద మరమ్మతుల పనులు జరుగుతుండటంతో చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు వివరణ…
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన రైతు నివేదన దీక్షకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్ పోలీసులు.. ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల పాటు వైఎస్ షర్మిల రైతు నివేదన దీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరారు.. అయితే, మూడు రోజుల దీక్షను అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు సెంట్రల్ జోన్ పోలీసులు.. కానీ, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో.. దానికి అనుగుణంగా వైఎస్‌ఆర్…
ధాన్యం సేకరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది.. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గరకు కూడా ధర్నా తలపెట్టారు.. దీని కోసం అనుమతి కోరుతూ పోలీసులకు పర్మిషన్ అప్లై చేవారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.. దానిని పరిశీలించిన సెంట్రల్ జోన్ పోలీసులు.. కొన్ని షరతులత కూడిన అనుమతి మంజూరు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్‌కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.…