సంగారెడ్డి జిల్లా మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్న విద్య అనే మహిళపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Womens Protest: గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళల ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి ఇబ్బంది పెట్టారంటూ కోటేశ్వరమ్మ అనే మహిళ ఆమె కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమపై దాడి జరిగిందని మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, సీఐ దురుసుగా వ్యవహరిస్తున్నారు అని బాధిత మహిళలు పేర్కొంటున్నారు.
UP Crime: పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో బేకరీ యజమాని అయిన వీరేంద్ర యాదవ్ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలతో సమాజంలో పరువు పోవడం, తన కుమార్తె వివాహంపై ఆందోళనతో ఆయన ఈ తీవ్ర చర్య తీసుకున్నాడు. పొరుగింటి వారితో ర్యాంప్ నిర్మాణం గొడవతో ఈ వివాదం మొదలైంది.
Perni Nani: కడప జిల్లా పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకాలు, ఆకృత్యాలు జరుగుతున్న పోలీసులకు పట్టడం లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
హైదరాబాద్‌లోని పబ్బులు గబ్బుకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయా?.. న్యూసెన్స్‌కు మించి పబ్బుల్లో గలీజ్ పనులు జరుగుతున్నాయా?.. కొంత మంది యువతులను ఎరగా వేసి కస్టమర్లను నిలువునా దోచేస్తున్నాయా?.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పబ్బులు నగరాన్ని గబ్బు పట్టిస్తు్న్నాయి. రూల్స్‌ను కూడా పట్టించుకోకుండా పబ్బుల్లో గలీజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల పబ్బుల ఆగడాలు శృతి మించుతున్నాయి.