పశువైద్యశాల డిడి అచ్చెన్న హత్య కేసులో కడప పోలీసుల నిర్లక్ష్యమే కారణం అన్నారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. డీడీ అచ్చెన్న హత్య కేసును సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. కర్నూలు వైద్య నిపుణులతో మృతదేహానికి రిపోస్టు మార్టం నిర్వహించాలి. కుటుంబ సభ్యులు ఈనెల 14న కడప పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 రోజుల పాటు పోలీసులు స్పందించలేదు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడున్నారని దాని పై కనీస దర్యాప్తు చేపట్టలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసిన పేర్లలో ఒకరి పేరు తొలగించాలని కడప వన్ టౌన్ సీఐ నాగరాజు బెదిరించాడన్నారు మందకృష్ణ.
Read Also: Karnati Rambabu: కొత్త జంటలకు అమ్మవారి అద్భుత దర్శనం
12వ తేదీ అచ్చన్న అదృశ్యమైతే 14న ఆయన సస్పెండ్ చేశారు. అచ్చెన్న హత్య విషయం తెలిసే ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు విచారించలేదు. మృతదేహం లభ్యమైన తర్వాతనే హత్య కేసుగా నమోదు చేసి అరెస్టు చేశారు. సీఎం జగన్ సొంత జిల్లాలోని దళిత ఉన్నతాధికారి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. డిడి హత్య వెనక ఎవరున్నా అరెస్టు చేయాలి. నిందితులు కాపాడే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతాం అన్నారు మంద కృష్ణమాదిగ.
Read Also: Game Changer: ఎవరిని మోసం చేస్తున్నారు.. బ్రూస్ లీ పోస్టర్ వేసి కొత్త పోస్టర్ అంటారేంటి..?