Love Couple Suicide: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు, యువతి ప్రేమికులను తేల్చారు. మృతులను డియోరియా నివాసి ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా గుర్తించారు.
Accident : అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా రైల్వేకోడూరు పరిధికి చెందిన కూలీలు, మామిడికాయలు కోసేందుకు రెడ్డిపల్లె ప్రాంతానికి వచ్చారు. పనులు పూర్తయ్యాక కోసిన కాయలను లారీలో లోడ్ చేసి తిరిగి బయలుదేరారు. అయితే చెరువు కట్ట…
Teenmar Mallanna : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ టీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూలై 12న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అంతర్జాతీయం, సంస్కృతి పరిరక్షణ కోసం స్థాపించబడిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ smt. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి మల్లన్న…
Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు..
ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు.
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. భార్యాభర్తలు స్పాట్లోనే మృతి చెందారు. తూప్రాన్ పేట్ కు చెందిన భార్యాభర్తలు వెంకటేష్, లక్షీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టు మర్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
Nagpur: నాగ్‌పూర్‌లో అత్యంత దారుణమైన గ్యాంగ్ ‘‘ఇప్పా గ్యాంగ్’’. ఈ గ్యాంగ్ లీడర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు ఓ గ్యాంగ్ మెంబర్. ఇంకేముంది, తన లీడర్నే మోసం చేసిన వ్యక్తిని చంపేందుకు ఏకంగా 40 మంది కరడుగట్టిన హంతకముంఠా అతడి కోసం వెతుకుతోంది. సదరు మహిళ, తాను ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తితో బయటకు వెళ్లిన సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం ముఠా ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భార్యామణి !! మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతునులిమి చంపడమే కాకుండా... ఆత్మహత్యగా చిత్రీకరించింది !! బంధువులనూ నమ్మించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఒక్క చిన్న క్లూ.. భార్య ఆడిన నాటకాన్ని బయటపెట్టింది !! ఇంతకూ ఎవరా కిరాతక భార్యామణి..? ప్రియురాలి డ్రామా వెనకున్న ప్రియుడు ఎవరు..?
Wife Kills Husband: భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా కొందరు కడతేరుస్తుంటే, వైవాహిక సమస్యలతో మరికొందరు భర్తల్ని అంతమొందిస్తున్నారు. చివరకు, పెళ్లి చేసుకుందామంటేనే యువకులు భయపడే స్థాయికి చేరింది. ఇటీవల, సోనమ్ ఘటన, గద్వాల్ తేజేశ్వర్ ఘటనలు భయపెడుతున్నాయి.