Andhra Pradesh: జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకొని యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కి తరలించారు.
Borugadda Anil : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అనంతపురం తరలించారు. పలు కేసుల్లో రిమాండ్ లో ఉన్న అతడిని తాజాగా అనంతపురం జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఇవాళ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో రాజమండ్రి నుంచి తీసుకువెళ్లారు. Discount on SUV: ఈ SUVపై రూ. 4.75 లక్షల…
Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Lagacharla Case: వికారాబాద్ లోని లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో A2 నిందితుడు సురేశ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారిస్తున్న పోలీసులు.
విశాఖ హనీట్రాప్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కస్టడీలోకి తీసుకున్న కిలాడీ జెమిమా నుండి కీలక ఆధారాలు స్వాధీనం పరుచుకున్నారు పోలీసులు. జెమిమాకు చెందిన మిగతా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కీలక వ్యక్తుల డేటా లభ్యం అయినట్లు సమాచారం.
సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నిందితురాలు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు జాయ్ జెమీమాను విచారిస్తున్నారు పోలీసులు... అయితే, కిలాడీ లేడీ పోలీసులు విచారణలో నోరు మెదపడం లేదట.. దీంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.. జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తించారు పోలీసులు... అందులోనే అసలైన డేటా ఉన్నట్లు తెలుస్తోంది.. మరో వైపు జెమీమా పరిచయాలపై కూడా నిఘా పెట్టారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Nandigam Suresh: గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఈరోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు.
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్.. రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో నందిగం సురేష్ తమకు సహకరించలేదని కేసులో దర్యాప్తు కోసం.. విచారణ చేసుకునేందు పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.