Sandip Ghosh: పశ్చిమ బెంగాల్ లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకున్నారు.
Love Couple: తిరుచానూరు పోలీసుల అదుపులో విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్య చౌదరి (26) మందడంకు చెందిన సాంబశివరావు (33) ప్రేమ జంట ఉంది. గత 11 ఏళ్లుగా అలేఖ్య, సాంబశివరావులు ప్రేమించుకుంటున్నారు.
మధ్యప్రదేశ్‌లో దేవా అనే గిరిజన యువకుడు లాకప్ డెత్ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గుణలో పార్ధి వర్గానికి చెందిన 25 ఏళ్ల గిరిజన యువకుడు పోలీస్ కస్టడీలో మరణించాడు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లిని ఈనెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పై దాడితో పాటు, పాలవాయి గేట్ లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు రోజులు కస్టడీకి కోరారు పోలీసులు.
Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పై బెదిరింపులకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గణనీయమైన పురోగతి సాధించింది. ‘ఆర్ ఛోడో యార్’ ఛానెల్లో యూట్యూబ్ వీడియో ద్వారా నటుడిని బెదిరించినందుకు రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల బన్వరిలాల్ లతుర్లాల్ గుజర్ ను అరెస్టు చేశారు. ఖచ్చితమైన సాంకేతిక దర్యాప్తు ద్వారా సాధ్యమైన ఈ అరెస్టు, నేరపూరిత బెదిరింపుల నుండి ప్రముఖులను రక్షించడంలో…
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్‌హెచ్‌ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్‌పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్‌లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు…
రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ భౌతికదాడికి తెగబడ్డారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు.
టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్‌ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.