Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందటం పట్ల మృతుని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు.
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. పోసాని కృష్ణ మురళి కోరితే.. న్యాయవాది సమక్షంలో అతడ్ని విచారణ చేయాలంటూ పోలీసుకు న్యాయస్థానం సూచించింది.
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ ఇచ్చింది నరసరావుపేట కోర్టు.. పోసానిని ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి.. పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఫిబ్రవరి 25న (మంగళవారం) ఉదయం 6 గంటలకు అత్యంత రద్దీగా ఉండే పూణెలోని స్వర్గేట్ బస్సు డిపోలో యువతి(26)పై దత్తాత్రే రాందాస్ (36) అనే యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రతో పాటు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి.
వల్లభనేని వంశీనీ నేడు కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణ నిమిత్తం వంశీ సహా మరో ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. అనుమతించింది కోర్టు.. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వంశీని విచారించనున్నారు పోలీసులు.. ఈ నెల 27వ తేదీతో వల్లభనేని వంశీ మోహన్ పోలీస్ కస్టడీ ముగినుంది..
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి బిగ్ షాక్. వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఈ రోజు ( ఫిబ్రవరి 24) ఆదేశాలు జారీ చేసింది.
Chilukuru: చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూడురోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డి సంబంధించిన అనేక కీలక అంశాలు వెలుగుచూశాయి. తాను శివుడి అవతారం అని ప్రకటించుకుని, “రామరాజ్యం” పేరిట రిక్రూట్మెంట్ ప్రారంభించినట్టు పోలీసులు గుర్తించారు. Read Also: Fake IT Jobs: ఫేక్…
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో మరి కొందరి ప్రమేయంపై సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆరా తీస్తుంది. గత రాత్రి అరెస్టు చేసిన నలుగురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది.