Borugadda Anil : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అనంతపురం తరలించారు. పలు కేసుల్లో రిమాండ్ లో ఉన్న అతడిని తాజాగా అనంతపురం జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఇవాళ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో రాజమండ్రి నుంచి తీసుకువెళ్లారు.
Discount on SUV: ఈ SUVపై రూ. 4.75 లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్!
వైసీపీ తరఫున సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు… ఇతర నేరాల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ ను కూటమి ప్రభుత్వం వచ్చాక అక్టోబర్ 17న పోలీసుల అరెస్టు చేశారు. అప్పటినుంచి రిమాండ్ కొనసాగుతోంది. అరెస్టు సమయంలో గుంటూరు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తూ మార్గమధ్యంలో ఏలూరు వద్ద బోరుగడ్డ అనిల్ ను ఎస్కార్ట్ పోలీసులు రెస్టారెంట్ కు తీసుకువెళ్లి బిర్యానీ తినిపించడం సంచలనం అయ్యింది. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు సస్పెన్షన్ అయ్యారు.