మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టడంతో 21ఏళ్ల యువకుడు మరణించాడు. ఈ ఘటనతో పోలీసులు అధికార దుర్వినియోగం చేశారంటూ ఆందోళనలు చెలరేగాయి. Read Also: Thanjavur Horror: అసలు వీడు కన్నతండ్రేనా.. భార్య మీద కోపంతో ఏం చేశాడంటే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. భోపాల్ ప్లానీలోని ఇంద్రపురిలోని ఒక తోట పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో స్నేహితులతో పార్టీ చేసుకుంటుండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులు కొట్టడంతో శుక్రవారం తెల్లవారుజామున…
Tamilnadu: 27 ఏళ్ల ఆలయ గార్డు కస్టడీలో మరణించిన ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, కస్టడీలో ఒక వ్యక్తి చనిపోవడంపై మద్రాస్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జూన్ 27న ఒక ఆలయం నుంచి ఆభరణాలను దొంగలించాడనే కేసులో అరెస్ట్ కాబడిన అజిత్ కుమార్‌పై ‘‘ అధికార మత్తులో ఉన్న పోలీసులు’’ దారుణంగా దాడి…
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కేసులో నిందితుడు సతీష్ కుటుంబ బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరికి సతీష్ పై పెట్టిన కేసు ఒక తార్కాణమని ఎద్దేవా చేశారు. పేద వడ్డెర కులస్తుడైన సతీష్ పై అక్రమ కేసు బనాయించి అతని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారన్నారు.
KTR : లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గిరిజనుల పట్ల జరిగిన అన్యాయాన్ని, పోలీసుల ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. లగచర్ల గ్రామస్తుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందంటూ ఢంకా మోగించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం లగచర్ల గిరిజన ఆడబిడ్డలు స్వచ్ఛందంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇది రాజకీయ సభలకు సాధారణంగా లభించే విరాళం కాదు, వారి ఆత్మబలమైన సంకేతం. “బీఆర్ఎస్ లాంటి పార్టీ…
సంగారెడ్డి సెంట్రల్ జైలులో కేటీఆర్ ములాఖత్ ముగిసింది. సుమారు 40 నిమిషాలు 16 మందితో ములాఖత్ సాగింది. ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారని, రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
రక్షించాల్సిన రక్షకభటులే.. భక్షిస్తున్నారు.. తప్పుచేయనివారిని హింసించి.. తప్పు ఒప్పుకోవాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన ఇది. అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం వెలుగులోకి వచ్చింది. చేయని దొంగతనం ఒప్పుకో వాలంటూ చిత్ర హింసలు గురిచేశారు. దెబ్బలు తాళలేక చేయని నేరం ఒప్పుకుంది లక్ష్మి అనే మహిళ .. ఏదో ఒకటి తెచ్చిస్తేనే వదిలేస్తామని పోలీసుల ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో చేసేదేం లేక.. భయంతో బాబాయ్ రాజేష్ చైన్ ను పోలీసులకు తెచ్చి ఇచ్చింది లక్ష్మీ.. అయినప్పటికీ వదలని…
అగ్రరాజ్యమైన అమెరికాలో నల్లజాతీయులపై దాడులు ఆగడం లేదు. యూఎస్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదడంతో అతను మరణించిన సంగతి తెలిసిందే.