KTR : ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు
- సంగారెడ్డి సెంట్రల్ జైలులో ముగిసిన కేటీఆర్ ములాఖత్
- సుమారు 40 నిమిషాలు 16 మందితో సాగిన ములాఖత్
- దాడి జరిగాక బీఆర్‌ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : సంగారెడ్డి సెంట్రల్ జైలులో కేటీఆర్ ములాఖత్ ముగిసింది. సుమారు 40 నిమిషాలు 16 మందితో ములాఖత్ సాగింది. ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారని, రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోకుంటే అధికారులు వస్తే నిరసన తెలిపితే తప్పా అని, ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. దుగ్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ అనుచరులే ఈ దాడి చేశారని చెబుతున్నారని, సీఎం రేవంత్ అన్నే ఈ దాడి డైరెక్షన్ ఇస్తున్నారని రైతులు చెప్పారన్నారు. దాడి జరిగాక బీఆర్‌ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని ఆయన ఆరోపించారు. థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు ఔట్టారని, మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్ళని కొడుతామని బెదిరించారని రైతులు చెబుతున్నారన్నారు.
Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు
Also Read
కొడంగల్ ఎస్సై, సీఐ వందల మంది పోలీసులు, ప్రయివేటు వ్యక్తులు బూతులు మాట్లాడుతూ దాడి చేసినట్లు తెలిపారన్నారు. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే అని, మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుందన్నారు. మేం అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని, జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుందన్నారు కేటీఆర్. బాధితులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందని, తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడేవాడు లేడని ఆయన అన్నారు. అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతామన్నారు కేటీఆర్. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ లోను అలాగే గొడవ జరుగుతుందని, హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారన్నారు. కేసీఆర్ మీకు అండగా ఉంటారని, రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మా పార్టీ అండగా ఉంటుందన్నారు కేటీఆర్.
Anil Ambani: అనిల్ అంబానీకి మళ్లీ భారీ ఎదురుదెబ్బ! ఎస్‌ఈసీఐ షోకాజ్ నోటీసు
- Tags
- BRS
- congress
- Farmers Protest
- kcr
- ktr
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!