డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ.. డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని.. అది సామాజిక బాధ్యతతో ప్రతీ ఒక్కరు సహకారం అందించినప్పుడే సాధ్యం అవుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.. దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలన్నారు.. అదొక సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు…