Minister Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల బృందం అధ్యయనం కొనసాగుతోంది.. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రాజెక్టును, అక్కడి మట్టి.. పరిసర ప్రాంతాలు ఇలా అనేక కోణాల్లో పరిశీలన చేసిన నిపుణుల బృందం.. ఈ రోజు కూడా తన పర్యటన కొనసాగిస్తోంది.. తమ పర్యటన, పరిశీలన, సమీక్షలు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంపై ఓ నివేదిక ఇవ్వనుంది.. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పనులపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు ను జగన్ ముంచేశారని విమర్శించిన ఆయన.. జగన్ చేసిన విధ్వంసం కారణంగా పునర్నిర్మాణాలు చేపట్టేందుకు సీడబ్ల్యూసీ ద్వారా అంతర్జాతీయ నిపుణులను పిలిపించి స్టడీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. రాజకీయాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ నిపుణులు ఇచ్చే సలహాలను CWC తీసుకోనుంది.. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పనులపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు.
Read Also: V.Hanumantha Rao: హాజీపూర్ ఘటన మర్చి పోలేనిది..
ఇక, రాజకీయ లబ్ది కోసం వాలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛను పంపిణీ జరగదని వైసీపీ అసత్య ప్రచారానికి టీడీపీ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు మంత్రి నిమ్మల.. పింఛన్లు కోసం ఎండల్లో తిరిగి చనిపోయిన 34 మంది మరణానికి జగన్ మోహనరెడ్డి కారణం అయ్యారు అని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో జులై 1వ తేదీ చారిత్రకమైన రోజు.. ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు అందించారు.. పెంచిన పింఛన్లు లబ్దిదార్లకు అందిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాము.. గత ప్రభుత్వంలో జగన్ కనీసం దివ్యాంగులకు ఒక్క రూపాయి పింఛన్ పెంచలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఖాజానా ఖాళీ చేసి 12.50 లక్షల కోట్లు అప్పు మిగిల్చినా.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.4,400 కోట్లు పింఛన్ అందించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ పంపిణీ కార్యక్రమంను విజయవంతం చేసిన అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.