రాష్ట్రాలకు కేంద్రం షాక్.. ఇకపై జాతీయ ప్రాజెక్టులో 60 శాతం నిధులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే న్యూస్ అందించింది. ఇకపై దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినా కేంద్రం నుంచి 60 శాతం మాత్రమే నిధులు వస్తాయని స్పష్టం చేసింది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా నిబంధనల ప్రకారం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేసి ఖర్చు చేస్తేనే… కేంద్రం నుంచి తదుపరి నిధులు విడుదల అవుతాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది.
Read Also: రూ.10 నాణేల చెల్లుబాటుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
కాగా ఇప్పటివరకు జాతీయ హోదా లభించిన సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు సమకూర్చేది. ఇకపై కేంద్రం వాటా 60 శాతానికి తగ్గిపోవడమే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రాలు పొందే నిధుల ప్రక్రియ సైతం మరింత క్లిష్టంగా తయారుకానుంది. ఒకవేళ సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నా ఆ సమయంలో నిధుల అందుబాటు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం ఉంటుంది తప్ప జాతీయ హోదా కల్పించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కేంద్రం తాజా నిబంధనలతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు 60 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే 8 ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడాఖ్‌లలో మాత్రమే జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 90 శాతం నిధులు జారీ చేయనుంది.
తాజావార్తలు
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!