ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో రెండేళ్ల పాటు ప్రభుత్వానికి ఊరట దక్కింది.. అనుమతులు లేని కారణంతో 2011లో పనుల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర పర్యావరణ శాఖ.. 2015లో ఈ ఉత్తర్వులను అభయెన్సులో పెట్టిన కేంద్రం ప్రభుత్వం.. అయితే, ఆ అభయెన్సు ఉత్తర్వులను ప్రతీ ఏటా కొనసాగిస్తూ వస్తున్న కేంద్ర సర్కార్.. మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది… తాజాగా ఏపీ ప్రభుత్వం, కేంద్ర జలశక్తి అభ్యర్థన మేరకు రెండేళ్ల పాటు కొనసాగించింది… ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ.
Read Also: Indian Embassy: రష్యా-ఉక్రెయిన్ టెన్షన్.. రంగంలోకి భారత్..!