విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఓవైపు గోదావరి ముంచెత్తుతుంటే.. అదే ముంపులో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. అల్లూరి జిల్లా విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల ఆందోళనలు హోరెత్తుతున్నాయి..నిన్న చింతూరు వరద నీటిలో ధర్నాకు దిగిన నిర్వాసితులు.. తాజాగా ఈ రోజు వి.ఆర్.పురంలో వద్ద భారీగా ఉన్న వరద నీటిలో ఆందోళన చేపట్టారు.. విలీన మండలాల్లో ప్రతి సంవత్సరం సంభవించే వరదలకు తాము అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకునే నాథుడే కారువయ్యాడని ఇక్కడి నిర్వాసితులు లబోదిబోమంటున్నారు.…