YSR Congress Party: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారా? అనేది పెద్ద ప్రశ్న అంటూ సోషల్ మీడియా వేదికగా YSR కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకున్న సందర్భాలు చాలా తక్కువని, రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని తెలిపింది. 100% ఖర్చును కేంద్రమే భరించాల్సి ఉందని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో…