పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ను భారత్‌లో విలీనం చేస్తామంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు.
Pakistan : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని మీర్పూర్లోని ఓ రెస్టారెంట్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ KFC అవుట్‌లెట్‌పై కొందరు వ్యక్తులు రాత్రి దాడి చేశారు.
PoK: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని ప్రజలే భారత్‌లో విలీనం కావాలనే డిమాండ్‌ని లేవనెత్తతున్నారని అన్నారు. పీఓకే భారత్‌లో విలీనం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పీఓకేపై తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో భాగమన్నారు. కాబట్టి, అక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ మా దేశ ప్రజలేనంటూ పేర్కొన్నారు.
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ప్రజలు ఇస్లామాబాద్ దురాగతాలతో విసిగిపోయారు. అనేక దశాబ్దాలుగా పాకిస్థాన్ వారిని సెకండ్ క్లాస్ హోదాతో పరిగణిస్తోంది.
POK: పాకిస్తాన్లో బ్రిటన్ రాయబారిగా ఉన్న జేన్ మారియట్ ఇటీవల పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో పర్యటించడం వివాదాస్పదమైంది. పాకిస్థాన్‌లోని UK హైకమిషనర్ జేన్ మారియట్ జనవరి 10న మీర్పూర్ను సందర్శించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె పర్యటన ‘‘అత్యంత అభ్యంతరకరం.. భారత సార్వభౌమాధికారం,
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.
Congress: పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన చేసిన కాల్పుల విరమణ, ఐక్యరాజ్యసమితిలోకి కాశ్మీర్ సమస్యను తీసుకుపోవడం వంటి ఈ రెండు తప్పులు కాశ్మీర్ వివాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023, రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను ఆయన నిన్న లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనుంది. బిల్లులలోని కీలక అంశాలను అమిత్ షా సభకు వెల్లడించారు.