Pochampally Srinivas : ఫాంహౌస్ కేసులో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నేడు పోలీసులు విచారించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ విచారణలో, ఫాంహౌస్ లీజుకు సంబంధించిన వివరాలను, ఘటనకు సంబంధించి ఆయన పాత్రపై ప్రశ్నలు వేసినట్టు సమాచారం. విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట న్యాయవాది , ఫాంహౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి ఉన్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. అనంతరం విచారణ ముగిసిన తర్వాత…
MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. కాసేపట్లో పోలీసులు ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారణ చేయనున్నారు. ఇక, ఫిబ్రవరి 11వ తేదీన తోల్ కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు చేసింది.
MLC Srinivas Reddy: తెలంగాణలోని మొయినాబాద్‌లో కోడి పందేలు నిర్వహించిన వ్యవహారంపై BRS ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసు నేపథ్యంలో, కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ తనదేనని ఒప్పుకున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అయితే ఆ భూమిని 2023లో వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా, రమేష్ కుమార్ రెడ్డితో పాటు మరొకరికి…
ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు, breaking news, latest news, telugu news, big news, Pochampally Srinivas Reddy, congress
తెలంగాణలోనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా నిధులు విధుల కేటాయింపు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో స్థానిక సుపరిపాలన సాకారం అవుతోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరింత గౌరవం గుర్తింపు కోసం పని చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి ల సహకారంతో జనగామ సమగ్ర అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందన్నారు. జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే…
వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు,తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. జన్మదిన…