MLC Srinivas Reddy: తెలంగాణలోని మొయినాబాద్‌లో కోడి పందేలు నిర్వహించిన వ్యవహారంపై BRS ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసు నేపథ్యంలో, కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ తనదేనని ఒప్పుకున్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అయితే ఆ భూమిని 2023లో వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజుకు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా, రమేష్ కుమార్ రెడ్డితో పాటు మరొకరికి కూడా లీజ్‌పై అప్పగించామని వివరించారు.
Read Also: Gold Price: మరోమారు దూకుడు చూపిస్తున్న బంగారం ధరలు..
ఫామ్ హౌస్ లీజు పత్రాలను పోలీసులకు అందజేసిన పోచంపల్లి, లీజ్ తీసుకున్న వ్యక్తులు ఆ స్థలాన్ని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్‌కు అప్పగించినట్లు తెలియజేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోడి పందేలు జరిగిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ వివరణను పోలీసుల ముందు తన న్యాయవాదితో కలిసి ఇచ్చిన ఎమ్మెల్సీ, లీజు పత్రాలతో సహా అన్ని ఆధారాలను పోలీసులకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.