కాంగ్రెస్ విజయం సాధించడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కర్ణాటక అభివృద్ధికి మా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు.
BREAKING NEWS: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. జూన్ 22న ప్రధాని అమెరికా పర్యటకు వెళ్తారని, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చే విందులో పాల్గొంటారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ పర్యటన అమెరికా, భారతదేశం మధ్య స్నేహబంధం మరింత పెరుగుతుందని, భారతీయులు, అమెరికన్ల స్నేహాన్ని ధృవీకరిస్తుందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలను ప్రాథమికంగా మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొన్న ఎన్నికల సంఘం.. ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారని ఇటీవల ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం కోసం బుల్లెట్ దాడులకు కూడా భయపడటం లేదని, ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రియాంకాగాంధీ, ప్రధాని మోడీకి సూచించారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మోడీని విషసర్పంతో…
Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రసారం అయింది. దేశంతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యలయంలో కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది. మన్ కీ బాత్ వల్ల ప్రజల్లోని భావోద్వేగాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ప్రధాని అన్నారు. తన ఆలోచనలను పంచుకోగలిగానని వెల్లడించారు. 100వ ఎపిసోడ్ కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని దేశంలోని కోట్ల మంది వినేలా బీజేపీ భారీ ఏర్పాట్లను చేసింది.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వేగం పెంచారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు. విపక్ష పార్టీ ఇప్పటివరకు తనను 91 సార్లు దూషించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. అలా చేసిన ప్రతీసారి ఆ పార్టీ కుప్పకూలిపోయిందని విమర్శించారు.
వారణాసిలో గంగా నదీ పుష్కరాల నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సమ్మేళనం' కాశీ తెలుగు సంగమం' కార్యక్రమం నేడు జరగనుంది. "కాశీ తెలుగు సంగమం" పేరుతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.