Governor Tamilisai Fires On BRS Govt For Not Inviting Secretariat Opening: ఫస్ట్ సిటిజన్‌గా తనను సెక్రటేరియట్ ఓపెనింగ్‌కి పిలవలేదని.. ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరంగా ఉంటున్నాయని గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. దేశాల అధినేతలను మనం కలవచ్చు.. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని విమర్శించారు. గచ్చిబౌలి రాడిసన్‌లో నిర్వహించిన జీ20లో భాగంగా సీ20 సమాజ్ శాల కార్యక్రమానికి తమిళిసై ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన భారతదేశం అన్ని రంగాల్లోనూ ప్రపంచానికి సొల్యూషన్ ఇస్తోందన్నారు. కేవలం మాటల్లో చెప్పడం కాదని, అన్ని చేతల్లో చేసి చూపించబడ్డాయని అన్నారు. కోవిడ్ టైంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. ఇండియాలో కొవిడ్‌తో 45లక్షల మంది చనిపోతారని ఇతర దేశాలయన్నాయని.. కానీ అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి మనం వారిని కాపాడామని అన్నారు. అయితే.. కొందరు చేసే పనిని మాత్రం వ్యతిరేకిస్తుంటారని కౌంటర్లు వేశారు.
Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
కొవిడ్ టైంలో తెలంగాణలో డాక్టర్లు కూడా వైరస్ భారిన పడ్డారని, తానూ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూశానని తమిళిసై చెప్పారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మనం ఎన్నో సాధించామని అన్నారు. కేవలం ప్రేమతోనే మనమంతా కొవిడ్ నుంచి ధైర్యంగా కోలుకోగలిగామన్నారు. మోడీ నేతృత్వంలో మనం ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. నంబర్ వన్ ఎకనామిక్ పవర్‌గా ఇండియా మారుతోందని ఉద్ఘాటించారు. జీ20 ద్వారా ప్రపంచానికి ఇండియా లీడర్‌గా నిలుస్తుందన్నారు. కానీ.. కొంతమంది కేవలం మాట్లాడుతారే తప్ప, పని చేయరంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. స్వామి వివేకానంద ఏం చెప్పారో.. ఇప్పుడు అవన్నీ మోడి చేస్తున్నారని తెలిపారు. అందరం ప్రజల కోసమే ఉన్నామని, అందుకు తగ్గట్టు పని చేయాలని సూచించారు. అభివృద్ధి అంటే కేవలం ఒక్క ఫ్యామిలీ కోసం కాదని, అందరూ డెవలప్ అవ్వాలని అన్నారు. నాయకులు, అధికారులు, రాజ్ భవన్, అందరూ కూడా ప్రజల కోసమే ఉన్నామని చెప్పుకొచ్చారు.
Safest Cities: భారతదేశంలోని 10 సురక్షితమైన నగరాలు