PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా మోడీ ప్రోగ్రామ్‌లో ప్రధాని వ్యాఖ్య
- కువైట్.. మినీ ఇండియాలా ఉంది
- హలా మోడీ ప్రోగ్రామ్‌లో ప్రధాని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్ మినీ ఇండియాలా ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారం కువైట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయులు ఏర్పాటు చేసిన ‘‘హలా మోడీ’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత్-కువైట్ మధ్య సంబంధం నాగరికతలకు, సముద్రానికి, వాణిజ్యానికి సంబంధించినది అని తెలిపారు. భారతదేశం, కువైట్ దేశాలు సముద్రం ఒడ్డున ఉన్నాయని చెప్పారు. దౌత్యం ద్వారా మాత్రమే కాకుండా హృదయాలతో కూడా రెండు దేశాలు అనుసంధానించబడినట్లు తెలిపారు. భారత్ నుంచి కువైట్ రావడానికి 4 గంటల సమయం పడితే.. ఓ భారత ప్రధాని కువైట్ రావడానికి 4 దశాబ్దాల కాలం పట్టిందని వివరించారు.
ఇది కూడా చదవండి: HYDRA: హైడ్రాకు అండగా న్యాయ నిపుణులు.. న్యాయ సలహాలు అందిస్తామని వెల్లడి
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ప్రతి ఏటా వందలాది మంది భారతీయులు కువైట్‌కు వస్తున్నారని, అలా కువైట్ సమాజానికి భారతీయతను పరిచయం చేశారని మోడీ కొనియాడారు. భారతదేశ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను మేళవించి కువైట్ నేలను భారతీయ నైపుణ్య రంగులతో నింపారని ప్రశంసించారు. ఈ దేశ వైద్యరంగానికి భారతీయ వైద్యులు, పారామెడికో సిబ్బందే ప్రధాన బలమన్నారు. కువైట్ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో భారతీయ ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా మారిందన్నారు. భారతీయులు కష్టపడి పని చేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. భారత్, కువైట్ దేశాలు అరేబియా సముద్రానికి ఇరువైపులా ఉన్నాయని.. ఈ రెండు దేశాలను కేవలం దౌత్యసంబంధాలే కలపడం లేదని.. హృదయ సంబంధాలు కూడా దగ్గర చేస్తున్నాయన్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండేవని వివరించారు.
#WATCH | Kuwait | PM Modi at the Community Event #HalaModi, says, "The relationship between India and Kuwait is of civilisations, of the ocean, of trade. India and Kuwait are situated on two banks of the Arabian Sea. We are linked not just by diplomacy but also by our hearts. Not… pic.twitter.com/UxNRWewD7m
— ANI (@ANI) December 21, 2024
#WATCH | Kuwait | PM Modi at the Community Event #HalaModi, says, "India was one of the first countries in the world to recognise Kuwait after its independence. So, visiting a country, a society with which I have so many memories… is very memorable for me. I am very grateful to… pic.twitter.com/CMqpwnQGpV
— ANI (@ANI) December 21, 2024
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!