Manmohan Singh Passes Away Live Updates: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి షిండేతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు..
అదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు.