ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. కాసేపట్లో వాజపేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి హాజరుకానున్నారు చంద్రబాబు..
అదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.
ప్రధాని మోడీ బుధవారం మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25న కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు.
రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో డా బీఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచాడని, ఆయనను ప్రధాని మోడీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని తెలిపారు. ఆదాని అగ్రిమెంట్పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసిందని, సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదన్నారు. ఆదాని అంశంపై డిప్యూటీ…
జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగిసింది.
PM Modi: నేడు జరుగుతున్న రోజ్గార్ మేళాలోనూ 71,000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు.
PM Modi: నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్గార్ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కువైట్లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్లైన్లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.