మరికాసేపట్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఢిల్లీ నుంచి 12:30 నిమిషాలకు మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరు కానున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్, సోమన్న, ఎంపీ ఈటల రాజేందర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు.
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. రూ.430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది.
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60…
ఈరోజు (జనవరి 5) ఢిల్లీలో రూ.12,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అలాగే, పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ పోల్స్‌కి అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ 29 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు తమ పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయని నరేంద్ర మోడీ వెల్లడించారు. సమాజ సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలే గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని చెప్పుకొచ్చారు.
Delhi Elections 2025: త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లిస్టులో 29 మంది పేర్లను ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం కోసం అరవింద్ కేజ్రీవాల్ ‘‘శీష్ మహల్’’ని విలాసవంతంగా నిర్మించారు.