Minister Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా.. ఇంకా అనుమానాలు ఎందుకు? అని ప్రశ్నించారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితికి కారణం గత 10 ఏళ్లలో సంస్ద యాజమాన్యం విచ్చలవిడిగా, అనాలోచితంగా తీసుకున్న పలు నిర్ణయాలే అన్నారు.. కానీ, కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా వచ్చి కార్మికులతో మాట్లాడి హామీ ఇచ్చినా ఇంకా అనుమానాలు ఎందుకు అని అసహనం వ్యక్తం చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకోచ్చింది ఏపీ ప్రజల కోసమే అని స్పష్టం చేశారు.. గతంలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే, ప్రతిపక్ష హోదా కూడా పోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే నేనేం చేయను.. అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Rangareddy: షాద్‌నగర్‌లో విషాదం.. ప్రిన్సిపాల్ మందలించారని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
రక్షణరంగానికి చెందిన పలు ప్రాజెక్టులు ఏపీలో నెలకొల్పేందుకు అనంతపురం అనువైన ప్రాంతం అన్నారు నారా లోకేష్.. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ను కలిసి ఆ దిశగా పెట్టుబడులను ప్రోత్సహించాలని కోరాను. ఏపీ మోడల్ .. ఆగస్టులో విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశాన్ని నిర్వహించాలని కోరాను. ఏపీ ఆతిధ్యమిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఞప్తి చేశాను. ఇప్పటివరకు ఆరు లక్షల కోట్ల రూపాయల మేరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలు ఐటీ, గ్రీన్ హైడ్రోజన్, ఉక్కు లాంటి పలు రంగాల్లో జరిగాయి. దీనివల్ల ఏపీలో 4 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వచ్చే 12 నెలల్లో ఏ మేరకు పెట్టుబడులు వస్తాయో ప్రజలే చూస్తారని తెలిపారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ విద్యాలయాలకు మారారని విమర్శించారు లోకేష్.. ఆ 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్సాలయాల నుంచి ఎందుకు వెళ్లిపోయారో బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఏపీలో ఉన్నత విద్యతో పాటు, పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్త ధ్వంసమైపోయిందన్న ఆయన.. ఓ వారంలో విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు నియామకం ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు..
Read Also: Madhya Pradesh : బిచ్చగాడికి బిచ్చం వేయడం కూడా తప్పేనా.. రూ.10 వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు
ఇక, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఎందుకు నిషేధం చెయ్యలేదో జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నారు లోకేష్.. అన్ని అంశాల్లో విచారణ జరుగుతుంది.. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు.. మరోవైపు.. మా కుటుంబానికి ఏకపక్షంగా సెక్యూరిటీని గత ప్రభుత్వం తీసేసింది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అలా కక్షపూరిత నిర్ణయాలు తీసుకోలేదు.. మాకు ఆ అవసరం లేదన్నారు.. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఏమాత్రం సెక్యూరిటీని తగ్గించలేదు.. యధాతధంగా సెక్యూరిటీ కోనసాగుతోందన్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు ఏ మాత్రం తగ్గించలేదు. విడతలవారీగా 45 మీటర్లు ఎత్తు మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరగుతుందని స్పష్టం చేశారు.. ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ బీజేపీ గెలుపును సూచించడం శుభపరిణామం అన్నారు.. కలుషితమైన రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని అనుకోవాలి. “డబుల్ ఇంజన్ సర్కార్” ను ప్రజలు ఆమోదించారు, అంగీకరించారని వ్యాఖ్యానించారు.. ప్రధాని మోడీతో త్వరలో భేటీ అవుతాను. ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, నేను స్వయంగా వచ్చి కలుస్తాను అన్నారు మంత్రి నారా లోకేష్..