Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ ప్రజాసేవ కంటే అరాచకాలు, అలజడి సృష్టించడానికే ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి పార్థసారధి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అహర్నిశలు దృష్టి సారిస్తుంటే, వైసీపీ మాత్రం యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలు వైసీపీ తీరును గమనిస్తున్నారని, ఆ పార్టీని రాజకీయంగా తిరస్కరించాలని భావిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైసీపీలో ప్రజలకు సేవ చేయడం కంటే అరాచకాలు చేయడానికే ప్రాధాన్యం ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. పార్టీ అధినేత దృష్టిని ఆకర్షించాలంటే విధ్వంసం, అలజడి, సమాజంలో చీలికలు సృష్టించే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పూర్తి వాస్తవాలు బయటకు రాకముందే రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఇటువంటి రాజకీయ డ్రామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా తిప్పికొడతారని ఆయన అన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావించిన మంత్రి, ఇప్పుడు కర్నూలు జిల్లాలోనూ అలాంటి పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలూరు ప్రాంతంలో బలహీన వర్గాలపై దౌర్జన్యాలు జరిగాయని, దళితులపై దాడులు జరిగాయని కూడా ఆయన ఆరోపించారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆయురారోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుంటే, ప్రతిపక్ష నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ప్రభుత్వం సహించదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తాజావార్తలు
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!