మోడీది…. ఆదానీ, అంబానీల ప్రభుత్వం : కడియం శ్రీహరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించడంతో సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని… మోదీది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఆదానీ, అంబానీల ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఏడేళ్ల కాలంలో భారతదేశ జీడీపీ తగ్గితే… తెలంగాణ జీఎస్టీపీ పెరిగిందని… భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు.
రైతుల విషయంలో అన్నీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రైతులకు శఠగోపం పడుతోందని…. బడా పారిశ్రామిక వేత్తలకు 10లక్షల 60వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన కేంద్రం రైతుల విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం సత్ఫలితాలు ఇచ్చిందని… ఉద్యోగాల కల్పన లేకపోగా… ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారని ఆగ్రహించారు.
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ఒకవైపు ఆహారపు కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే మీరు ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని.. బీజేపీ నేతలకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రైతులు ఎక్కడున్నా… రైతులే ఢిల్లీ రైతులతో పాటు తెలంగాణ రైతులనూ ఆదుకుంటామని… కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ కి ఏమి ఇచ్చింది ..బీజేపీ నేతలు ఏమి తెచ్చారని నిలదీశారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.
- Tags
- bjp
- cm kcr
- Kadium Srihari
- PM Modi
- TRS
తాజావార్తలు
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!