ఆ రైతులవి సహజ మరణాలు కాదు.. హత్యలు : రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతుల హక్కులను ఆధాని, అంబానీ లకు తాకట్టు పెట్టడానికి మోడీ చేసిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు పోరాటం చేశారు అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యారు. మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. రైతులు సహజ మరణం కాలేదు.. ఇవ్వి మోడీ చేసిన హత్యలు అని అన్నారు. మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టిన ఉద్యమంలో రైతులు వెనుకకు తగ్గలేదు. ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ లు. రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కు తీసుకుంటే అవి మా గొప్ప అని కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారు. మోడీ చట్టాలు తెచ్చినపుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే చెయ్యలేదు. ఏ ఒక్క రోజు రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదు.. ఒక్క రైతును పరమర్శించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఒక్క పూట ధర్నా చేస్తేనే భయపడి మోడీ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటే మరి రైతులు పండించిన పంటలకు ఎందుకు కొనేలా చేయడం లేదు. ఎప్పుడు కేసీఆర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పని చేయలేదు. కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలే అని తెలిపారు.
ఇక మోడీకి మొదటి నుంచి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడు. నోట్ల రద్దు కాడి నుంచి త్రిబుల్ తలాక్ వరకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారు. కల్లాలలో లక్షల టన్నుల ధాన్యం ఉంది. కేసీఆర్ వెంటనే రైతులను ధాన్యం అంత కొనాలి. మోదీని నమ్మొద్దు.. మోడీ వెంటనే నల్ల చట్టాలను రద్దు చేసేలా పోరాటాలు చేయాలి. పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుంది. వరి రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ మోసాలను రైతులు అర్థం చేసుకోవాలి. వరి రైతులకు న్యాయం చేయకపోతే కేసీఆర్ కు ఉరి వెయ్యాలి. రాష్ట్రంలో ప్రతి గింజ కొనే వరకు పోరాటం చేస్తాం… రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..