పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా…
దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు సంక్షోభం లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. కాగా, ఈరోజు ప్రధాని మోడి అధ్యక్షతన మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ప్రధాని సమీక్షను నిర్వహిస్తున్నారు. దేశంలోని థర్మల్…
ప్రధాని నరేంద్ర మోడీ-కేంద్ర హోంశాఖ అమిత్‌షా ద్వయానికి గుజరాత్ రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఎన్నో విజయాలను అందుకున్నారు.. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా కలిపి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ టీవీ చానెల్‌తో ప్రత్యేంగా మాట్లాడిన అమిత్ షా.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు.. మోడీ నియంత కాదని, తనకు తెలిసిన అత్యంత ప్రజాస్వామిక నేతల్లో ఒకరని పేర్కొన్న ఆయన.. మోడీ…
వీణవంక మండలం గన్ముకల గ్రామంలో టీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ కారుడైన గెల్లు.శీను తో 2004 నుండి నాకు పరిచయం ఉంది. గెల్లు శీను ను భారీ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తానని మాట తప్పారు నరేంద్రమోడీ అని అన్నారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది. కాంగ్రెస్ బీజేపీలు అధికారం ఉన్న రాష్ట్రాలలో 24 గంటల కరెంటు ఎందుకు లేదో చెప్పాలి. రెండు…
నోటు అనగానే మరకు దానిపై మహాత్మగాంధీ బొమ్మ గుర్తుకు వస్తుంది. గాంధీ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లుబాటు కాదు. అయితే, ఇప్పుడు ఆ గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రధానికి లేఖ కూడా రాశారు. రూ.2000, రూ.500 నోట్లను అవినీతితో పాటుగా బార్లలోనూ వినియోగిస్తున్నారని, అలా ఉపయోగించే వాటిపై గాంధీ మహాత్ముడి బొమ్మ ఉండడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు.…
తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మాణం చేపడుతామని మంచు విష్ణు నేడు తన మేనిఫెస్టోను విడుదల సందర్బంగా మాట్లాడారు. సొంతింటి కళతో పాటుగా.. వైద్య సహాయం.. ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. అర్హుల పిల్లలకు కేజీ టూ పిజి ఉచిత విద్య.. సభ్యుల కుటుంబంలో పెళ్లికి కల్యాణ లక్ష్మీ కింద లక్షా 16 వేలు ఇస్తామని మంచు విష్ణు తన మానిఫెస్టోలో తెలియజేశాడు. Read Also: మా…
లఖింపుర్ ఖేరిలో ఘటనల మీద కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు ప్రధాని మోడీ న్యాయం చేయాలని, ఈ కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్టు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయాలని, నిందితులకు శిక్షపడాలని ఈ దేశంలోని ప్రతి పౌరుడూ కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు.. లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర…
పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్‌తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్…
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రారు.. దళితబంధు పథకంపై అసెంబ్లీలో సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలను ప్రస్తావించారు.. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లో మనం శాసించే కేంద్ర ప్రభుత్వం రావొచ్చు అన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం పడొచ్చు.. లేకపోతే.. ఇప్పుడు ఉన్న కేంద్రమే మనల్ని కనికరించ వచ్చునని కామెంట్ చేశారు.. అనేక దఫాలుగా కేంద్రాన్ని నిధులు కూడా అడిగాం.. మీరు కూడా…
రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ.. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని.. భారత రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకుని.. ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు రెండు ఘాట్ల దగ్గర పుష్పాంజలి ఘటించారు. ఇక, ఇద్దరు నేతల జయంతి…