ఇక నుంచి ఒకే అమర్ జవాన్ జ్యోతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ జవాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి”లో ఈ రెండింటిని ఏకం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఈ రెండు జ్యోతులను ఏకం చేస్తారు. గణతంత్ర దినోత్సవాలకు సరిగ్గా 5 రోజులు ముందు ఈ మార్పుకు రక్షణ శాఖ శ్రీకారం చుట్టబోతుంది.
Read Also: నేడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
నేషనల్ వార్ మెమోరియల్‌లోనే అమర్ జవాన్ జ్యోతి
1914-1921 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుధ్దంలో మరణించిన “బ్రిటీష్-ఇండియా సైన్యానికి” చెందిన సైనికుల సంస్మరణార్ధం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా గేట్ ను నిర్మించింది. 1971 లో పాకిస్థాన్‌తో జరిగన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయి భారత వీర సైనికుల సంస్మరణార్ధం అమర్ జవాన్ జ్యోతిని భారత ప్రభుత్వం 1972లో ఏర్పాటు చేసింది. 1947-48 లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం నుంచి ఇటీవల గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లే కాకుండా, “ఇండియా గేట్” కట్టడం పై ఉన్న సైనికుల పేర్లను కూడా “నేషనల్ వార్ మెమోరియల్” (రాష్ట్రీయ సమర్ స్మారక్) లో గ్రానైట్ పలకల పై సువర్ణ అక్షరాలతో లిఖించారు. తీవ్రవాదులను తుదముట్టించే “ఆపరేషన్”లే కాకుండా, వివిధ సందర్భాలలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంస్మరణార్థం ఏర్పాటైన నేషనల్ వార్ మెమోరియల్‌లో మొత్తం 25,942 సైనికుల పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖించడం జరిగింది. కాబట్టి, రెండు చోట్ల జ్యోతులు కాకుండా ఇక నుంచి ఓకే “అమర్ జవాన్ జ్యోతి” వెలిగేలా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు వాటిని ఏకం చేయనున్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!