జేపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అంగీకారంతోనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ప్రొసీజర్ ఎలా నడుస్తుందో తెలవని ప్రధాని.. తెలంగాణ బిల్లును తలుపులు మూసి బిల్లును ఆమోదించి అవమానించారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఒక రాజులా పాలిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రభుత్వానికి సంబంధించిన జాతికి అంకితం అయినా ఎల్ఐసీ, విశాఖ స్టీల్, టెలికాంను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మోడీ జీ అంటూ ట్విట్టర్ వేదికగా మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ? అంటూ ప్రశ్నించారు.