KTR: శాసన సభలో మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై మాట్లాడుతూ.. బీజేపీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మండిపడ్డారు. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందని గుర్తు చేశారు. సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామన్నారని అన్నారు. గుజరాత్లో పరిశ్రలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారు అన్నారు. మోడీ పనితీరు గురించి మాట్లాడాలని అన్నారు. ముప్పై ఏళ్ళలో అత్యంత ఎక్కువగా నిత్యావసర ధరలు పెరిగాయని అన్నారు. 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిలిండర్ ధర భారతదేశంలో ఉందని అన్నారు. పెట్రోల్ ధర కూడా భారత్ లో ఎక్కువ అన్నారు. తెలంగాణలో వేట కుక్కలు తిరుగుతున్నాయ.. ఏమైనా దొరుకుతుంది ఏమో చూస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అవును మాది కుటుంబ పాలనే.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది మా కుటుంబమే అన్నారు. కుటుంబ పెద్ద కేసీఅర్ అని కేటీఆర్ తెలిపారు. పోడు భూముల విషయంలో తప్పు పట్టాల్సి వస్తె అది కాంగ్రెస్ సర్కార్ నే అన్నా మంత్రి కేటీఆర్
Read also: KTR : రోజుకు మూడు డ్రస్ లు మార్చడం కాదు.. విజన్ ప్రకారం పనిచేయాలి
మేము రైతురాజ్యం కావాలంటే.. బీజేపీవాళ్లు కార్పోరేట్ రాజ్యం కావాలని అంటున్నారని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరంటూ మండిపడ్డారు. దేశప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు ఆర్థికవేత్త లేరు అన్నారు మంత్రి. రోజుకు మూడు డ్రస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పనిచేయాలన్నారు. యాద్రద్రి పవర్ ప్రాజెక్టు ను అడ్డుకునే ప్రయత్నం కేంద్రం చేస్తుందని అన్నారు. PFC, REC లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వొద్దని బెదిరిస్తారని అన్నారు. తెలంగాణ పై కేంద్రం కు కక్ష్య చూపిస్తుందన్నారు. దక్షతతో మేము పని చేస్తుంటే…కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తుందని మండిపడ్డారు. నల్ల చట్టాలను తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.
Vemula Prashanth Reddy: అక్బరుద్దీన్ మీ సహనం తగ్గిపోతుంది