Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ చార్జి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
Narendra Modi: భారత ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ప్రధాని పర్యటన నేడు కొనసాగనుంది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
Rahul with ‘tukde tukde gang’, anurag thakur comments: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు.
మంత్రి కేటీఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. పీఎం మోడీ కి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
PM Modi to address third ‘No Money for Terror’ meet: ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో భారత్ ఎప్పుడూ దృఢంగా వ్యవహరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సులో అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు కొత్త ఆర్థిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారని అన్నారు. మేము వేలాది ప్రాణాలను కోల్పోయామని.. అయితే మేము ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఒక్క ఉగ్రదాని కూడా మేం తక్కువగా భావించడం…
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
ఇండోనేషియా బాలిలో నేటి నుంచి 17వ జీ20 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీని కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలికి చేరుకున్నారు. బాలిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికార బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నందున గుజరాత్ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోదీ ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి చేసింది.