PM Modi: పార్లమెంట్‌లో నీలిరంగు జాకెట్ ధరించిన ప్రధాని.. ప్రత్యేకత ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: వాతావరణ మార్పులపై పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన 2019లో మహాబలిపురంలోని ఒక బీచ్‌లో చెత్తను ఏరిపారేస్తూ కనిపించారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రత్యేకమైన నీలిరంగు జాకెట్‌లో కనిపించారు. ఆయన పార్లమెంట్‌లో ధరించిన నీలిరంగు జాకెట్ ప్రత్యేకమైనది ఎందుకంటే అది రీసైకిల్ చేయబడిన పెట్ బాటిళ్లతో తయారు చేయబడింది.
బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాని మోదీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఈ జాకెట్‌ను బహుకరించింది. ఐవోసీ ఉద్యోగులు, సాయుధ దళాల కోసం స్థిరమైన వస్త్రాలను తయారు చేయడానికి 10 కోట్ల కంటే ఎక్కువ పెట్ బాటిళ్లు రీసైకిల్ చేయబడతాయి. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సమర్పించేందుకు ప్రధాని మోదీ పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి రీసైకిల్ చేసిన ప్రత్యేక నీలిరంగు జాకెట్‌లో కనిపించారు.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
strange marriage: బ్యాండ్ బాజా మోగింది.. చిలుక పెళ్లి అయింది!
ఇటీవల ప్రభుత్వం రూ.19,700 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించింది. ఇది ఆర్థిక వ్యవస్థను తక్కువ కార్బన్ తీవ్రతకు మార్చడానికి, శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఈ రంగంలో సాంకేతికత, మార్కెట్ నాయకత్వాన్ని దేశం స్వీకరించేలా చేస్తుంది. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన పరివర్తన, నికర సున్నా లక్ష్యాలను సాధించడానికి రూ.35,000 కోట్లను అందించారు. ప్రభుత్వం ఏడు ప్రాధాన్యతలలో గ్రీన్ ఎనర్జీని జాబితా చేశారు.
🚨 PM Modi in Karnataka!
Indian oil corp presents 'Modi Jacket' to PM Modi made out of recycled PET Bottles.
More than 10 crore PET Bottles will be recycled to make sustainable garments to India Oil employees and Armed Forces!#IndiaEnergyWeek2023 pic.twitter.com/kSQVI7REk4
— Karthik Reddy (@bykarthikreddy) February 6, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..