Harish Rao : ప్రతీ మాట సత్య దూరం.. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. అయితే.. పరేగ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌తో పాటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. ‘ ప్రధాని మోడీ గారు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణ పై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉంది. ప్రతీ మాట సత్య దూరం. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతా లో జమ అవుతున్నాయి. తన వల్లే డిబిటి మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది? రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది.
Also Read : AP Politics: హస్తినలో ఏపీ రాజకీయం.. మొన్న పవన్, నేడు సోము.. ఏం జరుగుతోంది?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIR ను బెంగళూర్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు? అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ గారు చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు.’ అని ట్విట్టస్త్రాలు సంధించారు.
Also Read : Bajireddy Govardhan Reddy : ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలి
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..