బండి సంజయ్ చొరవతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ స్టేట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కలిసి పలకరించారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు మోడీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని కలిశారు. ఆఫీస్ లో పనిచేసే స్వీపర్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ మొదలు అక్కడ పనిచేసే సిబ్బంది అందిరినీ ఆప్యాయంగా పలకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చొరవతో ఈరోజు కార్యాలయానికి చెందిన సుమారు 40 మంది ఆఫీస్ సిబ్బందిని కలిసేందుకు మోడీ కార్యాలయం అనుమతిచ్చింది.
Also Read : Israel: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత.. టెల్ అవీవ్, వెస్ట్ బ్యాంక్ టార్గెట్ గా దాడులు..
దీంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆయా సిబ్బందిని వెంటబెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్దకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన మోదీ ఫామ్ నెంబర్ – 10 వద్ద కు వస్తూ అక్కడున్న సిబ్బందికి అభివాదం చేశారు. మీరంతా ఎన్నేళ్ల నుండి బీజేపీ ఆఫీస్ లో పనిచేస్తున్నారు? ఎలా ఉన్నారు?’’అంటూ పలకరించారు. అనంతరం ఒక్కొక్కరి వద్దకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మోడీని కలిసే అవకాశం రావడం తమ అదృష్టమని ఆయా సిబ్బంది పేర్కొనడం గమనార్హం. మోడీని కలిసిన వారిలో బంగారు శృతితోపాటు ఆఫీస్ ఇంఛార్జ్ కేవీఎస్ఎన్.రాజు, కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులున్నారు.
Also Read : Samantha: మాజీ భర్తను మర్చిపోయినా.. మరిదిని గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసిందే