Khushbu Sundar: ప్రముఖ సినీనటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి లభించింది. జాతీయ మహిళా కమిషన్( ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరిని నామినేట్ అయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యురాలు అయిన ఖుష్బూ తన నియామక పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా రైల్వే టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్న భారత్ నేడు స్వయం సమృద్ధి సాధించింది.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం షిల్లాంగ్‌లో రోడ్‌షో నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ వద్ద ప్రారంభమైన రోడ్‌షో పోలీసు బజార్లో ముగిసింది.
PM Narendra Modi: కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంగా ఉపయోగించుకుందని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. శుక్రవారం ఆయన నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ మాత్రం 8 ఈశాన్య రాష్ట్రాలను ‘‘ అష్ట లక్ష్మీ’’లుగా భావిస్తోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి, అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. దిమాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
Sansad Ratna Awards: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ‘సన్సద్ రత్న’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది సన్సద్ రత్న అవార్డు విజేతలను ప్రకటించారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ అవార్డుకు ఎంపిక అయిన ఎంపీల జాబితాను విడుదల చేశారు.. అందులో విజయసాయిరెడ్డికి చోటు దక్కింది.. సాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ తరపున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహిస్తోన్న విషయం…