Union Minister Kaushal Kishore: భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని తెలిపారు కేంద్రమంత్రి కౌషల్ కిషోర్.. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో 5వ రోజ్ గార్ (జాబ్) మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 300 మందికి నియామక పత్రాలు అందజేశారు.. రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించగా.. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నియామక పత్రాలు అందజేస్తున్నారు కేంద్ర మంత్రులు.. ఇక, ఈ సందర్భంగా కౌషల్ కిషోర్ మాట్లాడుతూ.. ఆత్మనిర్భర భారతదేశాన్ని తయారు చేయడమే లక్ష్యం అన్నారు.. 5 కోట్ల మందికి గృహ నిర్మాణం చేయడం, ప్రతీ ఇంటికి నీటి వసతి ఉండేలా పైప్ లైన్లు వేయడం లక్ష్యంగా వెల్లడించారు.
ఇక, నియామక పత్రాలు తీసుకునే వాళ్ళు మాదకద్రవ్యాలు తీసుకోకుండా సంబరాలు చేసుకోవాలని సూచించారు కౌషల్ కిషోర్.. ఈ రోజ్ గార్ మేళ దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహిస్తున్నాం.. ఈ సంకల్పానికి మద్దతిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు చేశారని తెలిపారు. ఉపాధి కల్పనకు ఉన్నత ప్రాధాన్యతను ఇవ్వాలనే మన ప్రధానమంత్రి నిబద్ధతను తెలియ చేస్తుందన్న ఆయన.. భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు ఈ ఉద్యోగ మేళా ఆదర్శ కార్యక్రమంగా నిలుస్తుందన్నారు.. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవడానికి ఇదొక మంచి అవకాశంగా తెలిపారు.. విభిన్న ప్రభుత్వ విభాగాలలో కొత్తగా నియమితులైన వారు.. ఆన్‌లైన్ ఓరియెంటేషన్ కోర్సు కర్మయోగి ప్రారంభ్ ద్వారా శిక్షణ తీసుకుని వస్తారని తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్ పై కేంద్ర మంత్రి కౌశల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా అభివర్ణించిన ఆయన.. ఉగ్ర నేపథ్యంలో పాకిస్థాన్ ఉంది.. భారత్ అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు.. పాకిస్థాన్ ను ఒక ఉగ్రవాద దేశంగా అభివృద్ధి చేశారు.. భాతరదేశం వ్యవసాయ దేశంగా అభివృద్ధి చెందిందన్నారు.. ఇక, రాజకీయ, వాణిజ్య రాజధాని విజయవాడకు తొలిసారిగా రావడం ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి కౌషల్ కిషోర్.