Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.
Read Also: Italy: మిలన్ నగరంలో భారీ పేలుడు.. అగ్నికి ఆహుతైన కార్లు..
పూరీలో ఏర్పాటు చేయాల్సిన అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆయన మాట్లాడినట్లు వెల్లడించారు. భువనేశ్వర్ లో ఇప్పటికే విమాన ట్రాఫిక్ పెరిగిందని, అందుకే విస్తరణ గురించి మాట్లాడినట్లు చెప్పారు. ప్రధాని సాయం చేస్తానని మాటిచ్చారన్నారు. నాకు తెలిసినంత వరకు థర్డ్ ఫ్రంట్ అనేది వచ్చే అవకాశం లేదని నవీన్ పట్నాయక్ అన్నారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ని కలిశారు. ఇద్దరు నేతలు సమావేశం అయ్యారు. ఈ చర్చల అనంతరం తమ మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని నవీన్ పట్నాయక్ అన్నారు. అయితే నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను కూడగట్టి, వాటి మధ్య ఐక్యత కోసం కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని, బీజేపీ ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యం అని చెబుతున్నారు. తాజాగా గురువారం ఆయన మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. కాగా నవీన్ పట్నాయక్ విపక్షాలతో కలిసి పోటీ చేయమని ప్రకటించడం నితీష్ కుమార్ కు షాక్ తగిలేలా చేసింది.